హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ విద్యార్థి. పోలీసులు, బాధితురాలి తల్లి వివరాల ప్రకారం.. సదరు యువతి(20)కి ఆశిష్ తనయ్ అనే విద్యార్థి ఇన్‌స్టా ద్వారా పరిచయమయ్యాడు. 2023 అక్టోబరులో తరగతి గదిలో ఆశిష్ తనపై అఘాయిత్యం చేశాడని బాధితురాలు తెలిపింది. ఈ మేరకు బెదిరించి పలుమార్లు హోటళ్లకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పేర్కొంది. నగ్న వీడియోలు, ఫొటోలు తీసి డార్క్ వెబ్‌లో పెట్టాడని తెలిపింది. యువకుడి వేధింపులు తాళలేక ఇటీవల యువతి బలవన్మరణానికి పాల్పడంతో ఈ విషయం బయటపడింది.