AP: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలోని మిక్ కాలేజీలో సీనియర్లు, జూనియర్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కాలేజీ ప్రాంగణంలోనే ఇరువర్గాల విద్యార్థులు పరస్పరం దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఓ యువతి విషయంలో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. విద్యార్థులను మందలించిన యాజమాన్యం.. ఘటనపై పోలీసులకు సమాచారం అందించింది. దీంతో సమస్య పరిష్కారం అవుతుందని తోటి విద్యార్థులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.