భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన 'బాహుబలి' ఇప్పుడు 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' పేరుతో యానిమేటెడ్ ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక ప్రదర్శన ఢిల్లీలో జరగనున్న అనిమే ఇండియా కార్యక్రమంలో ఏర్పాటు చేస్తున్నారు. అమరేంద్ర బాహుబలి మరణానంతరం 14 లోకాల భవిష్యత్తు ఈ కథకు ప్రధానాంశం. ఈ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా, అత్యున్నత 3డీ యానిమేషన్ సాంకేతికతతో రూ.120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. 2027లో థియేటర్లలో విడుదల కానుంది.