ముంబయిలో గణేశోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు (మంగళవారం) యోగా గురువు రామ్దేవ్ బాబా ప్రసిద్ధ లాల్బాగ్చా రాజాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.