PSL క్వాలిఫైయర్ మ్యాచ్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజం ఇస్లామాబాద్ యునైటెడ్‌పై అద్భుత సెంచరీ సాధించాడు. 59 బంతుల్లో 103 పరుగులు చేసి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ సెంచరీతో, టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు (9) చేసిన ఆటగాడిగా బాబర్ చరిత్ర సృష్టించాడు. ఫాఫ్ డుప్లెసిస్ (8) రికార్డును అధిగమించాడు. అలాగే, PSL చరిత్రలో ఇది బాబర్‌కు నాలుగో సెంచరీ కాగా, ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఫఖర్ జమాన్ రికార్డును సమం చేశాడు.