స్నానం చేసి ప్యాంటు ధరించిన ఒక యువకుడికి దాని జేబులో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. పరిశీలించగా, అందులో ఒక నాగుపాము పిల్ల కనిపించింది. యువకుడు భయపడకుండా వెంటనే స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం అందించాడు. వారు వచ్చి పాముపిల్లను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆరుబయట దుస్తులు ధరించే ముందు వాటిని విదిలించి చూసుకోవాలని సూచన.