రోడ్డుపై మొసలి పిల్ల.. వీడియో వైరల్

AP: కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని కందుకూరు గ్రామ సమీపంలో రామలింగేశ్వర దేవాలయం వద్ద తుంగభద్ర నది సమీపంలోని రోడ్డుపై ఒక చిన్న మొసలి పిల్ల కనిపించింది. నది నీటి ప్రవాహం నుంచి కొట్టుకొచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. రోడ్డుపై మొసలిని చూసి వాహనదారులు, బాటసారులు ఆశ్చర్యానికి గురయ్యారు. వాహనాల శబ్దాలకు భయపడి మొసలి పిల్ల సమీపంలోని ముళ్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ సంఘటనతో స్థానికులు, ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్