ఆడపిల్ల అంటే భారం అనే ఆలోచనను తొలగించి, ఆడబిడ్డలు బలం, ఆనందం అనే సందేశాన్ని చాటేలా డెహ్రాడూన్‌లోని ఒక కుటుంబం తమ ఇంటికి వచ్చిన మహాలక్ష్మికి ఘన స్వాగతం పలికింది. గులాబీ రంగు బెలూన్లతో అలంకరించిన కార్లలో 'బేటీ హుయీ హై' (ఆడబిడ్డ పుట్టింది) అనే ప్లకార్డుతో నగర వీధుల్లో ఊరేగించారు. ఈ వేడుక అందరినీ ఆకట్టుకుంది, ట్రాఫిక్‌ను కూడా నిలిపివేసి ప్రజలు ఈ ఆనందంలో పాలుపంచుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
VIDEO CREDIT: RJNEERAJ, ONE VISON MEDIA