ఆలయం ముందు ముళ్ళపొదల్లో ఆడశిశువు

కర్ణాటకలోని కొప్పళ జిల్లా, మునిరాబాద్‌ పరిధిలోని హులిగమ్మ దేవాలయం సమీపంలో మంగళవారం నవజాత ఆడ శిశువును దేవాలయంలో పనిచేస్తున్న హోంగార్డు మారుతి కాపాడారు. ముళ్ళపొదల్లోంచి అరుపులు వినిపించడంతో పరిశీలించగా, శిశువు కనిపించింది. అధికారులు శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. శిశువు 2 కిలోల 400 గ్రాముల బరువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శిశువును ఎవరు వదిలి వెళ్లారనే దానిపై పిల్లల రక్షణా విభాగం అధికారులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్