బేబీ ఆయిల్ కేవలం పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఎంతో ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చర్మం పగలకుండా, రాషెస్ తగ్గించడానికి, మాయిశ్చరైజర్‌గా, వ్యాజిలిన్‌కు ప్రత్యామ్నాయంగా పని చేస్తోంది. ఇక మేకప్ రిమూవర్‌గా, డ్రై స్కిన్ సమస్యలకు, టాన్ తొలగించడానికి, కంటి కింద నల్లటి చారలను తగ్గించడానికి ఉపయోగపడుతుందట. స్కిన్ అలర్జీలకు బేబీ ఆయిల్ చక్కగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు.