ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) శతాబ్ది మహోత్సవాల్లో పాల్గొన్న క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏయూ నుంచి వచ్చిన అనేక మంది వివిధ రంగాల్లో రాణించారని ప్రశంసించారు. తన తండ్రి కూడా ప్రొఫెసర్ అని, ఆయన సాధారణ నేపథ్యం నుంచి వచ్చి, కేవలం రెండు గదుల ఇంట్లోనే సర్దుకునేవారని గుర్తు చేసుకున్నారు. క్రీడాకారుడిగా ఎదిగిన తర్వాతే కారు కొనుక్కున్నానని, నెట్స్‌లో సాధన చేయడం వల్లే క్రికెట్‌లో రాణించానని, ఏ రంగంలోనైనా ఆత్మవిశ్వాసమే ఆయుధమని ఆయన పేర్కొన్నారు.