పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ విభాగంలో భారత స్టార్ షట్లర్ పి.వి సింధు పోరాటం ముగిసింది. భారత మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో చైనాకు చెందిన హె బింగ్‌జియావో చేతిలో సింధు 19-21, 14-21 తేడాతో ఓటమి పాలైంది. గతంలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పోరులో కూడా హె బింగ్ జియావోను సింధు ఓడించింది. దీంతో భారత బ్యాడ్మింటన్ అభిమానులకి నిరాశే మిగిలింది.