ఓయో హోటల్‌లో యువకుడిపై భజరంగ్‌దళ్ దాడి (వీడియో)

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఒక ఓయో హోటల్‌లో సల్మాన్ ఖాన్ అనే యువకుడు తన స్నేహితురాలు నేహాతో కలిసి ఉన్న సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న బజరంగ్‌దళ్ కార్యకర్తలు, వారిని చూసి భయపడి కిటికీలోంచి దూకి తప్పించుకోవాలని ప్రయత్నించిన సల్మాన్ ఖాన్‌ను వెంబడించి పట్టుకున్నారు. అనంతరం సదరు కార్యకర్తలు ఆ యువకుడిపై తీవ్రంగా దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕