బాలకృష్ణకు గోవాలో అరుదైన గౌరవం (వీడియో)

గోవాలో గురువారం ప్రారంభమైన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకల్లో ప్రముఖ నటుడు బాలకృష్ణను సన్మానించారు. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఆయనను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన ప్రయాణంలో భాగమైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ దంపతులకు జన్మించడం అదృష్టమని, తన భార్య వసుంధర మద్దతు ఎంతో ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్