TG: హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటపై అందరి దృష్టి నెలకొంది. శుక్రవారం గ్రామ ప్రదక్షిణ అనంతరం, ఉదయం 9:30 గంటలకు ఈ వేలం ప్రారంభమవుతుంది. ఈ లడ్డూను దక్కించుకుంటే సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. వేలం తర్వాత గణేష్ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌కు తరలిస్తారు. 18 కిలోమీటర్ల శోభాయాత్ర కొనసాగనుంది. భాగ్యనగరంలో ఖైరతాబాద్ గణేషుడి తర్వాత బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట అత్యంత ఆకర్షణీయంగా నిలుస్తుంది.