డాన్‌గా బాలయ్య…. అభిమానుల్లో ఆసక్తి!

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'ఎన్‌బీకే 111' అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య డాన్ పాత్రలో కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదివరకు బాలయ్య పూర్తిస్థాయి డాన్ పాత్రలో నటించలేదు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కు  ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాతో బాలయ్య డాన్ పాత్రలో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్