మొబైల్ ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్ల నాణ్యతపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిర్దేశించిన ప్రమాణాలు పాటించిన ప్రొటెక్టర్లను మాత్రమే విక్రయించాలని ఆదేశించింది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. గ్లాస్ పరిమాణం, దృఢత్వం, డిస్ప్లే స్పష్టత, బ్లూలైట్ ఫిల్టర్ వంటి ప్రమాణాలను తప్పనిసరి చేసింది. స్క్రీన్గార్డు ప్యాకెట్పై తయారీదారుల వివరాలు, బ్యాచ్ నంబర్, గ్లాస్ మందం వంటి వివరాలు ముద్రించడం తప్పనిసరి. ఈ చర్యతో నాసిరకం ప్రొడక్టుల స్థానంలో నాణ్యమైనవి అందుబాటులోకి వస్తాయి.