బాలీవుడ్ నటుడు సోనూ సూద్ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించాలని పిలుపునిచ్చారు. పిల్లలు భోజనం చేస్తూ కూడా ఫోన్లు స్క్రోలింగ్ చేస్తున్నారని, తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం ఆవేదన కలిగిస్తోందని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేసిందని, గోవా ప్రభుత్వం కూడా అనుసరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిని జాతీయ ఉద్యమంగా మార్చాలని ప్రధాని మోదీని కోరుతూ, పిల్లల మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సోనూ సూద్ స్పష్టం చేశారు.