అరటిపండు, ఖర్జూరం తింటే అలసట దూరం!

ఆధునిక జీవనశైలిలో అలసట, బలహీనత సర్వసాధారణమయ్యాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా నిపుణులు వ్యాయామంతో పాటు అరటిపండ్లు, ఖర్జూరాలను సూచిస్తున్నారు. ఒక అరటిపండులో 105 కేలరీలు, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్లు ఉంటాయి. మూడు నాలుగు ఖర్జూరాలలో 90-120 కేలరీలు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఎక్కువసేపు పనిచేయడానికి అరటిపండ్లు, తక్షణ శక్తికి ఖర్జూరం మంచివి. డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరం విషయంలో జాగ్రత్త వహించాలి. మితంగా తీసుకోవడం ముఖ్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్