TG: ఎల్లుండి విద్యాసంస్థల బంద్‌కు SFI పిలుపు

తెలంగాణలో నవంబర్ 30న విద్యాసంస్థల బంద్‌కు SFI పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని గురుకులాలు, పాఠశాలల్లో కలుషితాహారం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురికావడం, చనిపోవడం వంటి అంశాలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు SFI రాష్ట్ర అధ్యక్షుడు R.L.మూర్తి, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్