కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు

సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుమ్మక్కయ్యారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఆరోపించారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటనేది కాంగ్రెస్ కట్టుకథలని అన్నారు. కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీఆర్ఎస్ తో పోరాడింది బీజేపీయేనని, కాళేశ్వరం కూలిపోవడానికి బీఆర్ఎస్ దే బాధ్యత అని పేర్కొన్నారు. డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వంటి కేసుల్లో కేసీఆర్ కుటుంబంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఒక్కటా లేక బీజేపీ పోరాటం నిజమా అనేది ప్రజలే తేలుస్తారని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్