బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం (వీడియో)

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన మనబడి మన బాధ్యత కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా తరగతి గదిని శుభ్రం చేస్తుండగా, అకస్మాత్తుగా ఒక బెంచి బండి సంజయ్‌పై పడబోయింది. వెంటనే అప్రమత్తమైన బీజేపీ నాయకులు బెంచ్‌ను పక్కకు తొలగించడంతో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్