తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. వడ్లకు బోనస్ హామీ అంతా ఉత్తిదేనా అని ఆయన ప్రశ్నించారు. దళారులకు దోచిపెట్టి రైతులను రోడ్డున పడేయడమే ప్రభుత్వ విధానమా అని ఆయన ఆరోపించారు. ఈ లేఖ ద్వారా రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు.