తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్

TG: కేంద్రమంత్రి బండి సంజయ్‌ శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను TTD రక్షించాలని కోరారు. పురాతన ఆలయాలను గుర్తించి అభివృద్ధికి నిధులివ్వాలన్నారు. తెలంగాణలోని కొండగట్టు, కరీంనగర్‌, వేములవాడ, ఇల్లంతకుంట రామాలయాలను అభివృద్ధి చేయాలని టీటీడీ ఛైర్మన్‌ను కోరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్