జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ భుజం నొప్పితో బాధపడుతూ ముంబైలోని ధీరుభాయి అంబానీ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గాయం తీవ్రంగా ఉండటంతో వైద్యులు సర్జరీ చేయాలని సూచించారు. ఈ వార్తతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. 15 ఏళ్లుగా ఆయన పడుతున్న నరకాన్ని తలచుకుంటే గుండె బరువెక్కిందని, గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం, ఆపరేషన్ వాయిదా వేసి సినిమా పూర్తి చేసిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు.