షేక్ హసీనా ప్రెస్ మీట్ పై బంగ్లాదేశ్ అభ్యంతరం

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆగస్టు 5న ఢిల్లీలో నిర్వహించనున్న ప్రెస్ మీట్ పై బంగ్లాదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమాన్ని ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహిస్తోందని, భారత ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. హసీనాను తమకు అప్పగించాలని, భారతదేశంలో రాజకీయ ప్రకటనలు చేయకుండా ఉండాలని బంగ్లాదేశ్ కోరింది. ఆమె తిరిగి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ ప్రధాని సలహాదారు జాహీద్ ఉర్ రెహమాన్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్