తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అయ్యప్పను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నెల్లూరు కోర్టు ఆదేశాల మేరకు అయనను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించగా, ఈ రోజు విచారణ ప్రారంభించారు. ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ప్రతినిధుల నుంచి రూ.50 లక్షలు తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రశ్నిస్తున్నారు. నెయ్యి సరఫరా వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే అంశంతో పాటు, మాజీ చైర్మన్ పాత్రపై స్పష్టత కోసం అయ్యప్ప బ్యాంకు లావాదేవీలను కూడా సిట్ పరిశీలిస్తోంది.