10 ఏళ్లుగా వాడని బ్యాంక్ ఖాతా నుంచి కూడా డబ్బులు వెనక్కి!

మీరు బ్యాంకు ఖాతాను 10 సంవత్సరాల పాటు ఉపయోగించకపోతే, ఆ ఖాతా డీయాక్టివ్ అవుతుంది. అందులోని మొత్తం ఆర్బీఐ ఏర్పాటు చేసిన డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కి బదిలీ అవుతుంది. గత ఏడాది మే 24 నుంచి ఈ ఫండ్ అమల్లోకి వచ్చింది. దేశంలో 10 ఏళ్లకు పైగా ఉపయోగించని ఖాతాల్లోని డబ్బులు ఇప్పుడంతా ఈ ఫండ్‌లో ఉన్నాయి. మీ డబ్బు తిరిగి పొందాలంటే udgam.rbi.org.in/unclaimed-deposits పోర్టల్‌లో పాన్, ఆధార్ లేదా మీ పేరు ద్వారా లాగిన్ అయ్యి, మీ అకౌంట్‌ వివరాలు చూసి, సంబంధిత బ్రాంచ్‌కి వెళ్లి కేవైసీ చేసి క్లెయిమ్ ఫారంను సమర్పించాలి. డబ్బు క్లెయిమ్ చేసుకోవడానికి ఎలాంటి టైమ్ లిమిట్ లేదు.

సంబంధిత పోస్ట్