బ్యాంకర్ల స్ట్రైక్.. వరుసగా 3 రోజులు బంద్

వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానాన్ని అమలు చేయడంతో పాటు సవరించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకాన్ని ఉపసంహరించాలన్న డిమాండ్లపై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సమ్మెకు పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె, 28 నుంచి 30 వరకు వరుసగా మూడు రోజుల సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించింది. డిమాండ్లు పరిష్కారం కాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించింది. సెప్టెంబర్ 11 తర్వాత 12, 13 తేదీల్లో వరుస సెలవులు ఉండటంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగొచ్చు.

సంబంధిత పోస్ట్