TG: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్టేడియంలో 66.5 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు. మొత్తం 1500 మంది మహిళలతో బతుకమ్మ ఆడించి.. గిన్నిస్ రికార్డు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ వేడుకలకు మంత్రి సీతక్క హాజరై మహిళలతో కలిసి ఆటపాటలతో సందడి చేశారు.