మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సౌతాఫ్రికా 2-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ప్రొటీస్ కెప్టెన్ టెంబా బవుమా చరిత్ర సృష్టించాడు. 27 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి సౌతాఫ్రికా కెప్టెన్‌గా నిలిచాడు. కాగా, ఇంగ్లండ్ గడ్డపై సౌతాఫ్రికా 1998లో చివరిసారి వన్డే సిరీస్ గెలిచింది.