ఐపీఎల్ 2026 సందడి మధ్య సడన్‌గా విషాదం నెలకొంది. ముంబైలో BCCI బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ ఇయాన్ విలియమ్స్ లాంగ్‌ఫోర్డ్ అనుమానాస్పద స్థితిలో ఓ హోటల్ గదిలో మృతి చెందారు. బ్రిటన్‌కి చెందిన ఈయన మార్చి 24 నుంచి ముంబై హోటల్‌లో ఉంటున్నారు. మార్చి 30న ఉదయం సిబ్బంది ఫోన్ చేసినా స్పందించకపోవడంతో గది తలుపులు తెరవగా, అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్టు కనిపించారు. ముంబై మెరైన్ డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్, హోటల్‌లోని ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు.