ముంబై హోటల్ గదిలో బీసీసీఐ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్‌ మృతి

ఐపీఎల్ 2026 మ్యాచ్‌లు జరుగుతున్న ముంబైలోని వాంఖడే స్టేడియం వద్ద విషాదం చోటుచేసుకుంది. బీసీసీఐ కోసం పనిచేస్తున్న బ్రిటన్ పౌరుడు, బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ ఇయాన్ విలియమ్స్ లాంగ్‌ఫోర్డ్ (30) మార్చి 30న ఉదయం తన హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మార్చి 29న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ తర్వాత గదికి చేరుకున్న ఆయన, మరుసటి రోజు స్పందించకపోవడంతో సిబ్బంది తలుపులు తెరిచి చూడగా, నేలపై అపస్మారక స్థితిలో కనిపించారు. హోటల్ డాక్టర్ ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్