పాక్ ఆటగాళ్ల రెచ్చగొట్టే సైగలు.. ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు

ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 21న జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు హరిస్ రౌఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్ రెచ్చగొట్టే సైగలు చేశారని బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిద్దరి ప్రవర్తనపై బీసీసీఐ సెప్టెంబర్ 24న ఐసీసీకి అధికారికంగా ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. రౌఫ్ ఫైటర్ జెట్ కూలిపోయినట్లు, 6-0 సైగలు చేయగా, ఫర్హాన్ గన్ సెలెబ్రేషన్ చేసుకున్నాడు. వీరిద్దరిపై ఐసీసీ విచారణ జరిపే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్