తెలంగాణలో రానున్న 4 రోజులు జాగ్రత్త!

TG: రాష్ట్రంలో ఎండల తీవ్ర పెరుగుతోంది. రానున్న నాలుగు రోజులు ఉష్ణోగ్రత 2-3 డిగ్రీలు పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, గద్వాల, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో 36°C నుంచి 40°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

సంబంధిత పోస్ట్