కొత్త నంబర్ల నుంచి కాల్ చేసి, అవతలివైపు నుంచి ఎవరూ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం (DoT) హెచ్చరించింది. మీ నంబర్ యాక్టివ్‌గా ఉందో లేదో సైబర్ నేరగాళ్లు ఇలాగే చెక్ చేస్తారని తెలిపింది. ఇలాంటి నంబర్లకు తిరిగి కాల్ చేయవద్దని ప్రజలను అప్రమత్తం చేసింది. ఇలాంటి కాల్స్‌ను వెంటనే సంచార్ సాథీ యాప్‌లో రిపోర్ట్ చేయాలని DoT సూచించింది.