క్రెడిట్ కార్డులతో వార్షిక ఆదాయానికి మించి ఖర్చులు చేస్తే ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్నేహితుల కోసం కార్డు వాడటం, అద్దె చెల్లింపులకు క్రెడిట్ కార్డు నుంచి బ్యాంకు ఖాతాకు మళ్లించడం, డిజిటల్ వాలెట్లలో భారీగా డబ్బు లోడ్ చేయడం వంటి లావాదేవీలు ఐటీ శాఖ దృష్టిని ఆకర్షిస్తాయి. ఏడాదికి ₹10 లక్షలకుపైగా కార్డు ఖర్చులను బ్యాంకులు ప్రభుత్వానికి నివేదిస్తాయి. లెక్కలు సరిగా ఉంచుకుంటే నోటీసుల భయం ఉండదని సూచిస్తున్నారు.