నదీస్నానం చేసేటప్పుడు జాగ్రత్త.. శబరిమలకు వెళ్లే భక్తులకు అలర్ట్

శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులను అక్కడి ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. కేరళ రాష్ట్రంలో అమీబిక్ మెనింజోఎన్సైఫలిటిస్ (బ్రెయిన్ ఫీవర్) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నదీస్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది. వేడి చేసిన నీటినే తాగాలని, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్ 04735 203232ను సంప్రదించాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్