ఘోర విమాన ప్రమాదం.. 46 మంది మృతి (VIDEO)

సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టేకాఫ్ అయిన సైనిక విమానం జనావాసాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో 46 మంది మృతిచెందారు. మరో 10 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. మంగళవారం వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్