ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. కేసీఆర్ వస్తారు: KTR

TG: ఆదిలాబాద్‌ వేదికగా జరిగిన ‘రైతు గర్జన’ సభలో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంటలు వేయవద్దని ప్రభుత్వం రైతులను భయపెడుతోందని, సాగు చేస్తే జరిమానాలు విధిస్తామనేలా పరిస్థితి ఉందని ఆరోపించారు. రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. రైతుబంధు పథకాన్ని మూడుసార్లు ఎగ్గొట్టారని ఆయన విమర్శించారు. రైతులు ఒక్క ఏడాది ఓపిక పడితే, మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తారని, అప్పుడు అందరినీ ఆదుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕