ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లా జైత్‌పురా పంచాయతీ ఘర్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్ ఉస్మాన్ అలీ, పంచాయతీ అసిస్టెంట్ షకీల్ అహ్మద్ మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి కర్రలు, కుర్చీలతో పరస్పరం దాడి చేసుకున్నారు. గొడవ తీవ్రం కావడంతో సర్పంచ్ ఉస్మాన్ అలీ ప్రాణభయంతో ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.