రోజువారీ పాటించే అలవాట్లలోనే అందం ఉంటుందంటున్నారు నిపుణులు. ముఖంపై మొటిమలు రావడానికి నిర్లక్ష్యం కారణం. అందుకే ఉదయం, రాత్రి ముఖం శుభ్రపరచుకోవాలి. పబ్లిక్ టాయిలెట్ కంటే మొబైల్ స్క్రీన్ ఎక్కువ అపరిశుభ్రంగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే మొబైల్‌ను తాకిన చేతులతో ముఖాన్ని తడుముకోవద్దు. కాయకూరలు, తృణ ధాన్యాలు తినాలి. అధిక బరువూ మొటిమల సమస్యకు దారి తీస్తుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలి.