తండ్రిగా మారిన అనుభవం అద్భుతంగా ఉంది: విక్కీ కౌశల్‌

బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌ తండ్రిగా మారిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి వెల్లడించారు. కత్రినా కైఫ్‌, తాను గతేడాది నవంబరులో విహాన్‌కు జన్మనిచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విక్కీ మాట్లాడుతూ.. బిడ్డ తొలి ఏడుపు, బోసి నవ్వులు, కొత్త హావభావాలు వంటి ప్రతి చిన్న విషయమూ అద్భుతంగా అనిపిస్తోందన్నారు. కొడుకుతో కత్రినా గడుపుతున్న క్షణాలను చూస్తుంటే జీవితం పరిపూర్ణంగా అనిపిస్తోందని చెప్పారు. తండ్రిగా మారిన తర్వాత తనలో సున్నితత్వం, బాధ్యత మరింత పెరిగాయని, పిల్లలు ఇంట్లో పెద్దలను చూసి నేర్చుకుంటారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕