పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభంపై ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ అప్పుల కోసం ప్రపంచ దేశాల చుట్టూ తిరగడం తనకు, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు సిగ్గుగా ఉందని ఆయన అన్నారు. అప్పులు తీసుకోవడం ఆత్మగౌరవానికి భారం అని, ఈ పరిస్థితి వల్ల తలలు వంగిపోతున్నాయని తెలిపారు. పాకిస్థాన్ హైబ్రిడ్ పాలనలో ఉందని, దేశ మనుగడలో సైన్యం కీలక పాత్ర పోషిస్తోందని ఒప్పుకున్నారు. ఆర్థిక వ్యవస్థను స్థిరపరచడంలో ఆర్మీ చీఫ్ మునీర్, సైన్యం 100 శాతం కృషి చేస్తున్నారని ప్రశంసించారు.