కర్ణాటకలో సస్పెండైన ఐపీఎస్ అధికారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ నిద్రమాత్రలు మింగారు. బళ్లారి అల్లర్ల వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన పవన్ నెజ్జూర్ తుముకూరులోని ఓ ఫామ్ హౌస్ లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.