న్యూజిలాండ్‌ బౌలర్‌కు ఊహించని అవకాశం

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ బెన్ సియర్స్‌కు టీ20 ప్రపంచకప్‌లో ఊహించని అవకాశం దక్కింది. గతేడాది గాయాలతో ఇబ్బందిపడిన అతనికి ట్రావెలింగ్ రిజర్వ్‌గా అవకాశం లభించింది. ఆడమ్ మిల్నే గాయపడటంతో కైల్ జేమీసన్ ప్రధాన జట్టులోకి వెళ్లగా, ఇప్పుడు జేమీసన్ స్థానాన్ని సియర్స్ భర్తీ చేశాడు. ఫిబ్రవరి 5న ముంబైలో అమెరికాతో జరిగే వార్మప్ మ్యాచ్ లోపు జట్టుతో సియర్స్ కలుస్తాడు. న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ సియర్స్ ఫిట్‌నెస్ ను ప్రశంసించారు. సూపర్ స్మాష్ టోర్నీలో 9 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. 140 కిమీ వేగంతో బంతులు వేయడం సియర్స్ ప్రత్యేకత.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్