టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సీవీ ఆనంద బోస్ చేతుల మీదుగా ఆయన బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతగా ఉన్నారు. ఇటీవల వీరి బ్యానర్‌లో ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' సినిమా విడుదలైంది.