బెంగళూరు ఐటీ స్టార్టప్‌లో 40% ఉద్యోగుల తొలగింపు

2026లోనూ ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఒక ఐటీ స్టార్టప్ తన ఉద్యోగులలో 40 శాతం మందిని ఒకే రోజు తొలగించింది. సీఏ అర్పిత్ గోయల్ అనే ఎక్స్ (ట్విటర్) యూజర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏడాదికి రూ. 92 లక్షలు సంపాదిస్తున్న ఉద్యోగులను కూడా ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో తొలగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన ఉద్యోగ మార్కెట్లో పెరుగుతున్న అనిశ్చితిని స్పష్టం చేస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదని, కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్