బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ రిపోర్ట్‌ను సీఎం సిద్ధరామయ్యకు సమర్పించింది. 11 మంది మరణానికి, 50 మంది గాయాలపాలవడానికి.. RCB, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, DNA ఎంటర్‌టైన్‌మెంట్, బెంగళూరు పోలీసులు బాధ్యులని నివేదిక తేల్చింది. క్రౌడ్ నియంత్రణ సాధ్యం కాదని తెలిసినా ర్యాలీ కొనసాగించారని పేర్కొంది. విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణంగా పేర్కొంది.