కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసుల ద్వారా పొదుపు, పెట్టుబడి పథకాలను అమలు చేస్తోంది. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం ద్వారా సంవత్సరానికి 6.7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ పథకంలో 5 సంవత్సరాల పాటు రోజుకు రూ. 222 (నెలకు రూ. 6,660) పెట్టుబడి పెడితే.. వడ్డీతో కలిపి మొత్తం రూ. 4,75,297 లభిస్తుంది. ఈ పెట్టుబడిని 10 సంవత్సరాలు కొనసాగిస్తే, వడ్డీతో సహా మొత్తం రూ. 11,37,981 లభిస్తుంది. పదేళ్లలో మీరు రూ. 7,99,200 పెట్టుబడి పెడతారు, దీనిపై రూ. 3,38,781 వడ్డీ వస్తుంది.